Let us enquiry



(Download Audio file in mp3 format size 48.6mb)

अतः विचारः कर्त्तव्यः


మానవులందరూ కూడా నిరంతరాయంగా ఒక పని చేయాలి. అప్పుడే నువ్వు దివ్యత్వాన్ని సాధించగలుగుతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
మీ పాఠంలో ఏముంది? రోజూ పాఠంలో ఏం చదువుకుంటున్నారు?
ఆ దివ్యజ్ఞానాన్ని పొందాలి, ఆ దివ్యత్వాన్ని పొందాలి” అని చదువుకుంటున్నారా? లేదా?
ఈ దివ్యత్వాన్ని, ఈ దివ్యజ్ఞానాన్ని సాధించాలి అనంటే, ఏం చెయ్యాలి మరి? - అనే ప్రశ్న రావాలా? వద్దా?
సదా ఆత్మానుభూతిలో వుండాలి’ - అనేటటువంటి భావన నీకు కలుగుతుందా లేదా? నీకు పాఠంలో వుందా? లేదా?
ఆత్మానందాన్ని అనుభవించాలని నీ పాఠంలో వుందా? లేదా?
మరి సాధించామా? అనుభవించామా?
బ్రహ్మజ్ఞానం” అంటున్నామా లేదా? బ్రహ్మజ్ఞానంసాధించామా?
అసలు బ్రహ్మజ్ఞానంఅంటే ఏమిటి?
మనకు పాఠం నుంచీ పదే పదే ప్రశ్నలు రావాలన్నమాట!
ఎప్పుడొస్తాయి?
ఆ పాఠం నీకు జీర్ణమయితే వస్తాయి.
ఎప్పుడు జీర్ణమవుతుంది?
నిజ జీవితంలో (ఆ పాఠ సారాంశాన్ని) వాడుకుంటే అవుతుంది.
నిజ జీవితంలో వాడుకుంటే అవుతుంది.
అప్పుడు నీవు దేనిని అధిగమిస్తావు?
నిన్న మీకు ఐదు స్థితులు చెప్పా! ఏం చెప్పాను?
అసంతృప్తి, అవసరం, అవసరం నుంచి కోరిక, కోరిక నుంచి కాంక్ష, కాంక్ష నుంచి మోహం.
ఈ ఐదు వున్నయా లేదా ఇప్పుడు మనకి చూసుకోండి.
ఏ “ఆలోచన”లో అయినా ఈ అయిదు స్థితులు వుంటాయండి. దానికి మూలంలో ఒక అసంతృప్తివుంటుంది. ఆ అసంతృప్తికొద్దిగా బలపడి
అవసరంఅయ్యింది. ఆ అవసరంబలపడి కోరిక అయ్యింది. కోరికబలపడి కాంక్షఅయ్యింది. కాంక్షఅయ్యి ఏమైంది? ‘మోహంఅయ్యింది.
ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి?
మోహక్షయమే మోక్షం.
మోక్షం అంటే ఎక్కడో వుందనుకునేరు, ఎక్కడో ఆకాశంలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో లేదు. అర్థమైందా అండీ!
మోహక్షయమే మోక్షం”.
వాడికి ఈ ఐదు లక్షణాలు లేవు వాడికి (ముక్తుడికి).
అసంతృప్తిలేదు, ‘అవసరంలేదు, ‘కోరికలేదు, ‘కాంక్షలేదు, ‘మోహంలేదు.

ఈ ఐదు లక్షణాలు ఎవరికైతే లేవో, వాడు మోక్షాన్ని సాధించాడు.